‘సీటీమార్‌’లో కామెడీ కూడా ఉందట !

‘సీటీమార్‌’లో కామెడీ కూడా ఉందట !

Published on Feb 26, 2020 8:00 AM IST

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా సిటీమార్ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గోపీచంద్ పై కొన్ని కామెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సపంత్ నంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ కామెడీ సీక్వెన్సెస్ లో గోపీచంద్ తో పాటు తమన్నా, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కూడా షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. కాగా ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

తాజా వార్తలు