బేబీ బాయ్ కి తండ్రైన గోపీచంద్ మలినేని

Gopichand-Malineni1

పరిస్థితులను చూస్తుంటే ప్రస్తుతం టాలీవుడ్ లో బేబీస్ హావా నడుస్తుందనిపిస్తుంది. వీరూ పోట్ల తరువాత, మరొక డైరెక్టర్ కి బుజ్జి బాబు పుట్టాడు. సూపర్ హిట్ సినిమా ‘బలుపు’ కి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేనికి బుజ్జి బాబు పుట్టాడు. ఈ విషయం గురించి మేము అడిగినప్పుడు హ్యాపీ గా ఉన్న గోపీచంద్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు.

గోపీచంద్ మలినేని ఇప్పటి వరకు ‘డాన్ శీను’, ‘బాడీగార్డ్’, ‘బలుపు’ సినిమాలకు దర్శకత్వం వహించి వరుస హిట్ లు సాదించారు. ప్రస్తుతం తను తీయబోయే తరువాతి సినిమా కోసం ప్రీ -ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాను అతను దిల్ రాజ్ తో తీసే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా గోపీచంద్ మలినేనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

Exit mobile version