గోపీచంద్ మరియు తాప్సీలు ప్రధాన పాత్రలలో ఒక చిత్రం రానుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “జాక్ పాట్” అనే పేరుని పరిశీలిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సెక్యూరిటీ గార్డ్ పాత్రలో కనిపించనున్నారు. పూర్తి సాహసోపేతమయిన ఈ చిత్రం నిధుల అన్వేషణ నేపధ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రం ప్రధాన బాగా చిత్రీకరణ లడక్,రాజస్తాన్ మరియు జోర్డాన్ లలో జరుపుకుంది. ఈ చిత్రంలో ఆఫ్గనిస్తాన్ క్రీడ అయిన బుజాక్షి సీక్వెన్స్ చిత్రానికే ప్రధాన ఆకర్షణ కానుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ మీద బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.