యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్-నయనతార

gopichand-nayantara
మాచో హీరో గోపీచంద్ – అందాల భామ నయనతార కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి బి. గోపాల్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రిన్స్ స్ట్రీట్ లో కణల్ కన్నన్ ఆధ్వర్యంలో హీరో హీరోయిన్ లపై ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు.

తాండ్ర రమేష్ – జయ బాలాజీ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అలాగే ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత గోపీచంద్ గత సంవత్సరం ‘సాహసం’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. డైరెక్టర్ బి. గోపాల్ గతంలో ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’ లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.

Exit mobile version