కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘గ్రీకువీరుడు’ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతుంది. ఇది ఒక హుందా తరహాలో సాగే ప్రేమకధ. ఇందులో నాగార్జున సరసన నాయనతార నటిస్తుంది. మాకు వచ్చిన నివేదికల ప్రకారం ఈ సినిమాలో, ముఖ్యంగా రెండో భాగంలో హృదయానికి హత్తుకునే సెంటిమెంట్ ఉంటుందంట.
ఈ చిత్రాన్ని దశరధ్ తెరకెక్కిస్తున్నాడు. శివ ప్రసాద్ రెడ్డి నిర్మాత. థమన్ సంగీత దర్శకుడు.
నాగార్జున ఈ చిత్రంలో ఎన్.ఆర్.ఐ గా ఒక కొత్త వేషధారణలో కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ‘సంతోషం’ తరువాత కలిసి పనిచేస్తున్న నాగార్జున, దశరధ్ ఒక మంచి విజయాన్ని ఆశిస్తున్నారు.