పవన్ సినిమా ఆ టైటిల్ కంటే దీనికే భారీ రెస్పాన్స్..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అత్యున్నత ప్రామాణికలతో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మాత్రం అంచనాలు అన్నీ అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే అప్పుడు కూడా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్ ఏమిటి అన్నది రివీల్ చేయలేదు. కానీ అప్పటికే మూడు టైటిల్స్ ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయని టాక్ వినిపిస్తూనే “ఓం శివమ్” అనే మరో టైటిల్ లైన్ లోకి వచ్చింది. అయితే ముందు వినిపించిన మూడు టైటిల్స్ లో “విరూపక్ష”కు మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్ “ఓం శివమ్” కు అయితే మరింత స్థాయి రెస్పాన్స్ మరియు ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది.

అయినప్పటికీ కూడా ఇంకా పవర్ ఫుల్ టైటిల్ కోసం కూడా చిత్ర యూనిట్ చూస్తున్నారట. అలా ఒక ఫైనల్ నిర్ణయినికి వచ్చే వరకు మాత్రం ఈ విషయంలో ఒకింత సస్పెన్స్ మాత్రం అలా తప్పదని చెప్పాలి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా క్రిష్ వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version