గోపీచంద్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘సాహసం’. ఈ సినిమాకి హైదరాబాద్లోని అన్ని సెంటర్స్ లో వారం చివరిల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమా గోపీచంద్ ఒక సెక్యూరిటీ గార్డ్ గా కనిపిస్తాడు. తను ఒక నిధిని వేటాడడానికి పాకిస్థాన్ కి వెళ్తాడు. తాప్సీ హీరొయిన్ గా నటించిన ఈ సినిమాలో శక్తి కపూర్ విలన్ గా నటించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాని మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో, మంచి టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు.