గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్.. అక్కడ అజిత్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు అధిక్ రవిచంద్ర డైరెక్ట్ చేయగా, అజిత్ మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు.

మాస్ ఆడియెన్స్, ఫ్యాన్స్‌కు ఈ మూవీ బాగా ఎక్కేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా తొలిరోజు సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా తమిళనాట ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా అక్కడ అజిత్ కెరీర్‌లోనే హయ్యె్స్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. తొలిరోజు తమిళనాడులో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏకంగా రూ.30.9 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా భారీ క్యాస్టింగ్ నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version