మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న మొదటి సినిమా ఫిబ్రవరి 27న ప్రారంభం కానుందని నిన్ననే మీకు తెలియజేశాం. శ్రీ కాంత్ అద్దాల డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.
ఎమోషనల్ మరియు కుటుంబ కథా చిత్రాలు తీయడంలో శ్రీ కాంత్ అడ్డాలకి మంచి పేరుంది. వరుణ్ తేజ్ సినిమాకి శ్రీ కాంత్ అడ్డాల గోదావరి డెల్టా ఏరియాలో జరిగే అందమైన ప్రేమకథని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. లియో ఫిల్మ్స్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి – ఠాగూర్ మధు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.