టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్టర్ గా మారి ‘నువ్విలా’ ఫేం హవిష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘జీనియస్’. ఈ మూవీకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, రీ రికార్డింగ్ పనులు చివరిదశలో ఉన్నాయి. అది కూడా ఈ శుక్రవారంకి పూర్తవుతుందని సమాచారం. డిసెంబర్ 21 న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సనూష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అశ్విన్,అభినయ మరియు శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి జోష్వా శ్రీధర్ సంగీతం అందించాడు. కథా రచయిత చిన్నికృష్ణ కథ అందించిన ఈ సినిమా సోషల్ మెసేజ్ తో పవర్ఫుల్ గా ఉండనుంది.