మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాకి రంగం సిద్ధమైంది. యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన ఏ.ఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాని బన్నీవాస్ నిర్మించనున్నాడు. బన్నీవాస్ గతంలో 100% లవ్ సినిమాని నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తుండగా దిల్ రాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 24న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హీరొయిన్ ఇంకా ఖరారు కాలేదు.