సెట్స్ పైకి వెళ్ళిన గౌతమ్ ‘బసంతి’

సెట్స్ పైకి వెళ్ళిన గౌతమ్ ‘బసంతి’

Published on Feb 4, 2013 9:00 PM IST

Brahmanandam's-son-Gautham

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బసంతి’. ‘బాణం’ ఫేం చైతన్య దంతులూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల చివరి వరకూ జరగనుంది. ఈ యాక్షన్ డ్రామా సినిమా ద్వారా కొత్త హీరోయిన్ పరిచయం కానుంది. ఎ లవ్ స్టొరీ బిట్వీన్ ఎ కైట్ అండ్ ఎ ఫ్లైట్ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక.

ఇప్పటికే మణిశర్మ ఈ సినిమా కోసం అందించిన మ్యూజిక్ బాగా వచ్చిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అనిల్ బండారి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సినిమాతో గౌతమ్ బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

తాజా వార్తలు