నానిని పొగడ్తలలో ముంచెత్తిన గౌతం మీనన్


రొమాంటిక్ చిత్రాలను చెయ్యడంలో తనదయిన శైలిని సృష్టించుకున్న దర్శకుడు గౌతం మీనన్ ఇప్పటి దర్శకులు ఆయనలా రొమాంటిక్ చిత్రాలని తెరకెక్కించాలని అనుకుంటారు. ఆయన నాని గురించి గొప్పగా చెప్పడం ఎవరికయినా ఆశ్చర్యకరమయిన విషయమే. నాని ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చెన్నైలో చిత్రీకరణ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో నాని గురించి చెబుతూ గౌతం ఇలా ట్వీట్ చేశారు ” నాని తో పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది ఆయనతో ఎప్పుడు అవకాశమున్న మరో చిత్రం చేశాను ఆయనలో ఆత్మ విశ్వాసం నన్ను ఆకట్టుకుంది” అని అన్నారు. ఇదే కాకుండా “సింపుల్ చిత్రం, మంచి సంగీతం, మంచి నటులు జీవా ,నాని మరియు సమంత. ఇది నాకు మంచి అనుభవం ప్రతినిమిషం నాకు నచ్చింది” అని కూడా అన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా ఎం ఎస్ ప్రభు మరియు ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు . అన్ని సరిగ్గా కురిడితే అక్టోబర్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version