మూడు కొత్త ప్రొజెక్ట్లతో దూసుకొస్తున్న గౌతమ్ మీనన్

మూడు కొత్త ప్రొజెక్ట్లతో దూసుకొస్తున్న గౌతమ్ మీనన్

Published on Nov 18, 2013 11:01 PM IST

gautam-menon
గౌతమ్ మీనన్ మెగా ఫోన్ పట్టుకుని దాదాపు యేడాది కావస్తుంది. ముందుగా తమిళ నటుడు విజయ్ తో సినిమా ఉంటుంది అని తెలిపినా తరువాత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ తదుపరి చిత్రం 1930 నేపధ్యంలో సాగే సినిమా అని, ఇందులో సూర్య హీరో అని తెలిపాడు. అయితే కొన్నికారణాల వలన సూర్య ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ప్రొజెక్ట్ అటకెక్కింది

తాజా సమాచారం ప్రకారం గౌతమ్ శింబు హీరోగా ఒక సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో నాయిక ఎంపిక జరుగుతున్నా, చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా వుండగా ట్విటర్ ద్వారా తన అభిమానులకు ఫిబ్రవరి 15నుండి అజిత్ తో ఒక సినిమా ఉంటుందని తెలిపాడు. ఇవే కాక గౌతమ్ కార్తీక్ నటిస్తున్న ‘నావుమ్ రౌడీతాన్’ సినిమాను సమర్పిస్తున్నాడు. విజ్ఞేష్ శివన్ దర్శకుడు. అంతేకాక అతను నిర్మిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ షూటింగ్ జరుపుకుంటూ వచ్చే యేడు విడుదలకు సిద్ధమవుతుంది

తాజా వార్తలు