మరో రెండు రోజుల్లో గౌరవం రెండవ షెడ్యూల్ పూర్తి

మరో రెండు రోజుల్లో గౌరవం రెండవ షెడ్యూల్ పూర్తి

Published on Sep 5, 2012 1:08 AM IST


అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “గౌరవం” చిత్ర రెండవ షెడ్యూల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది.ఈ ద్విభాషా చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తుండగా డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ ,యామి గౌతం, సాయి చరణ్, నాజర్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ రెండు నెలల క్రితం మైసూరులో మొదలయ్యింది, రెండవ షెడ్యూల్ ఈ మధ్యనే రాజమండ్రిలో జరుగుతుంది. చాలా వరకు టాకీ భాగం పూర్తయ్యింది మరో రెండు చిన్న షెడ్యూల్లలో చిత్రం పూర్తి కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కులానికి విలువనిచ్చి ప్రతిభను వెనక్కి నెట్టేస్తున్నారు అనే అంశాన్ని చర్చించనున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రకాష్ రాజ్ నుండి వచ్చిన “ఆకాశమంత” మరియు “ధోని” చిత్రాలను ఆదరించారు ఈ చిత్రం మీద ఆ చిత్రాల ప్రభావం తప్పకుండా ఉంటుంది.

తాజా వార్తలు