“బిగ్ బాస్ 4” విన్నర్ ఎవరో గంగవ్వ జ్యోతిష్యం.!

“బిగ్ బాస్ 4” విన్నర్ ఎవరో గంగవ్వ జ్యోతిష్యం.!

Published on Oct 14, 2020 3:00 PM IST

అనుకున్న దానికంటే ఎక్కువగానే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 4 రన్ మొదట్లో అంటే కాస్త తడబడ్డా తర్వాత ట్రాక్ లోకి వచ్చేసరికి రసవత్తరంగా షో కొనసాగుతుంది. అయితే ఈ షోలో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్ మాత్రం గంగవ్వ అని చెప్పాలి. యూట్యూబ్ ఫేమ్ గంగవ్వ రోజు నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

దీనితో బిగ్ బాస్ వీక్షకుల్లో ఈమెపై ఎప్పుడూ మంచి సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. కానీ ఊహించని విధంగా ఆమె అనారోగ్యం పాలు కావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతానని బయటకొచ్చేసారు. అయితే ఆరోగ్యం పరంగా కోలుకున్నా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈసారి బిగ్ బాస్ 4 సీజన్ విన్ అవుతారో తన జోష్యం చెప్పారు.

తాను అయితే ఈసారి జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ పేరును ముందుంచారు. అయితే అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినప్పటికీ గంగవ్వతో బిగ్ బాస్ హౌస్ లో మంచి బాండింగ్ ఏర్పడింది. బహుశా అందుకే అవినాష్ ను మరింత గమనించి తన జోష్యాన్ని ఉండొచ్చు. మరి ఎంతో అనుభవం ఉన్న ఈమె వేసిన అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు