అల్లు అర్జున్ సినిమాకి గణేష్ ఆచార్య స్టెప్పులు

Allu-Arjun-and-Ganesh-Achar
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా విషయంలో రోజు రోజుకీ ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా అమోల్ రాథోడ్ ని, అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచ ని తీసుకున్నారు. తాజాగా ఈ టీం లోకి గణేష్ ఆచార్యని డాన్స్ కొరియోగ్రాఫర్ గా తీసుకున్నారు. తను బాలీవుడ్లో హిట్ అయిన బాడీగార్డ్, సింగం, ఓంకారా, అలాగే లెక్కలేనన్ని గోవిందా సినిమాలకు కొరియోగ్రఫీ చేసాడు.

ఇటీవలే ప్రభుదేవా ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఎబిసిడి’ సినిమాలో తను కూడా కనిపించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి గణేష్ ఆచార్య తన స్టైల్లో స్టెప్స్ కంపోజ్ చేసి తెరపై కనువిందు చేయించనున్నాడు. అమలా పాల్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బార్సెలోనాలో జరుగుతోంది,

Exit mobile version