అమెరికా బయలుదేరిన “గబ్బర్ సింగ్” ప్రింట్లు

అమెరికా బయలుదేరిన “గబ్బర్ సింగ్” ప్రింట్లు

Published on May 9, 2012 3:55 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాల ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్” చిత్రం అమెరికా ప్రింట్లు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరాయి. 20 బౌతిక ప్రింట్లు 45 డిజిటల్ ప్రింట్లు ఈ రోజు పంపారు 10వ తేది ప్రిమియర్ షో సమయానికి ఇవి అక్కడికి చేరుకుంటాయి. నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ అందుకుంది.
శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 11 న విడుదల కావటానికి సిద్దమయ్యింది. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మరిన్ని ప్రదేశాలకు పంపిన ప్రింట్ల సమాచారం కోసం చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు