మర్యాద రామన్నఇంట్లో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్

మర్యాద రామన్నఇంట్లో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్

Published on Mar 20, 2012 8:09 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్ కోకాపేటలోని మర్యాద రామన్న చిత్ర షూటింగ్ జరిగిన సెట్లో జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ప్యాచ్ వర్క్ కి సంభందించిన షూటింగ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. గబ్బర్ సింగ్ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్ కి జోడిగా శృతి హసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోదరుడిగా అజయ్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కి జల్సా వంటి బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్ మే 9 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

తాజా వార్తలు