తమిళ నాడు మరియు అమెరికా లో కూడా సత్తా చాటుతున్న గబ్బర్ సింగ్

తమిళ నాడు మరియు అమెరికా లో కూడా సత్తా చాటుతున్న గబ్బర్ సింగ్

Published on May 13, 2012 8:49 PM IST


పవన్ కళ్యాణ్ మరియు శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “గబ్బర్ సింగ్” ఆంధ్ర ప్రదేశ్ అంతటా అద్బుతమయిన కలెక్షన్లను రాబట్టుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అమెరికా మరియు తమిళనాడులో కూడా భారీ కలెక్షన్లను రాబట్టుతుంది. ముంబై కి చెందిన ప్రముఖ సిని విలేఖరి తరన్ ఆదర్శ్ ఈ చిత్రం ప్రముఖ బాలివుడ్ చిత్రాల కన్నా అమెరికాలో ఎక్కువ వ్యాపారం చేసినట్టు ప్రకటించారు. బాలివుడ్ చిత్రాల థియేటర్లలో మూడో వంతు థియేటర్లలో విడుదలయినా వాటి కన్నా ఎక్కువ కలెక్షన్లను రాబట్టిందని చెప్పారు. “గబ్బర్ సింగ్ చిత్రం ఈ వారంతం మొత్తం కలిపి $577,090 వసూలు చేసింది” అని ట్విట్టర్ లో తెలిపారు. అయన అంచనా ప్రకారం ఈ చిత్రం అమెరికాలో మరింత బిజినెస్ చేయ్యనుంది “దూకుడు” చిత్రం తరువాత అంతటి అంతకన్నా ఎక్కువ పరిధిలో ఈ చిత్రానికి కలెక్షన్లు ఉన్నాయి. తమిళనాడు లో ఈ చిత్రం 25 స్క్రీన్లలో విడుదల కాగా ఎక్కడ కలెక్షన్లు డ్రాప్ కాలేదు ప్రముఖ తమిళ పరిశ్రమ పాత్రికేయుడు శ్రీధర్ పిళ్ళై ట్విట్టర్ లో ఇలా అన్నారు ” ఒక తెలుగు చిత్రానికి ఇది అద్బుతమయిన ఓపెనింగ్ గబ్బర్ సింగ్ చెన్నై లో కూడా అద్బుతమయిన ఓపెనింగ్స్ రాబట్టుతుంది ఈ సంవత్సరంలో ఇదే ఉత్తమం కొన్ని మల్టీ ప్లేక్స్ లు చిత్రాన్ని రెండవ రోజు కూడా పెద్ద తెరల మీద ప్రదర్శిస్తున్నారు ” . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్బుతంగా ఆడుతుంది. ఎన్ని రికార్డ్ లను బద్దలు కొడుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు