గబ్బర్ సింగ్ విడుదల తేదీ ఖరారు

గబ్బర్ సింగ్ విడుదల తేదీ ఖరారు

Published on Mar 5, 2012 7:39 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ మసాల ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ మే 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి సంభందించిన క్లైమాక్స్ సన్నివేశాలు ఈ నెల 9 నుండి చిత్రీకరించనున్నారు. గతంలో మిరపకాయ్ వంటి హిట్ చిత్రాన్ని అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హసన్ నటిస్తుంది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ భారీ అంచనాల మధ్య విడుదలవుతుండగా ఇటీవల విడుదల చేసిన టీజర్ మరియు పవన్ కళ్యాణ్ స్టిల్స్ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసాయి.

తాజా వార్తలు