పవన్ కళ్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్” ఆంధ్ర దేశమంతటా అద్బుతమయిన వసూళ్లు రాబట్టుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మేము గతంలో చెప్పినట్టుగా ఈ చిత్రం మొదటి రోజు సీడెడ్ లో 1.7 కోట్లు వసూలు చేసింది. మా వద్ద ఉన్న ప్రతేయ్క సమాచారం ప్రకారం ఈ చిత్రం సీడెడ్ లో రెండవ రోజు ౬౭ లక్షలు వసూలు చేసి మొదటి రోజు కలెక్షన్లతో కలిపి రెండు రోజుల్లో 2.3 కోట్లు వసూలు చేసింది. మరి కొన్ని ప్రాంతాలలో ఈ చిత్ర కలెక్షన్లు.
గుంటూరు – 37 లక్షలు
కృష్ణ – 25 లక్షలు
నెల్లూరు – 15 లక్షలు
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మించారు. పవన్ కళ్యాణ్ మరియు శ్రుతి హాసన్ లు ప్రధాన పాత్రలు పోషించగా దేవి శ్రీ ప్రసద్ సంగీతం అందించారు.