దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’

దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’

Published on Jun 29, 2012 8:35 AM IST


టాలీవుడ్లో ఎప్పటికప్పుడు తన స్టైల్ మరియు నటనతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “గబ్బర్ సింగ్”, భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాదించడమే కాకుండా ఈ చిత్రం ఈ రోజుతో 306 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం హైదరాబాద్లో అత్యదిక కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకున్న చిత్రంగా నమోదైంది. ఈ చిత్రం విడుదలైన రోజునుంచి భారీగా కలెక్షన్లు రాబట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు, ఈ చిత్రం ఇప్పటికే టాలీవుడ్ లో అత్యధిక రికార్డు కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా చేరిపోయింది. ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆ చిత్ర టీంకి మా తరపున అబినందనలు తెలుపుకొంటున్నాము.

తాజా వార్తలు