పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా జూన్ చివరి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ‘రచ్చ’ సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం పవన్ కలయన్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగష్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.