ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను రూపొందిస్తూ వస్తున్న గుడ్ సినిమా గ్రూప్ ‘క్రేజీ అంకుల్స్’ అనే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. శ్రీముఖి, భరణి, మనో, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. అయితే ఒక్క పాట మినహా దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో నేడు చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రముఖ సింగర్, నటుడు మనో మాట్లాడుతూ క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించానని, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో మంచి యూనిట్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ హాయిగా నవ్వుతూ చూడొచ్చని అన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇక నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను యోగ టీచర్‌గా కనిపించబోతున్నానని, కరోన సమయంలో వర్క్స్ లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు గుడ్ సినిమా గ్రూప్స్ వారు వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాది కల్పించడం నిజంగా అభినందించాల్సిన విషయమని అన్నారు. ఇక ఈ మూవీ తప్పకుండా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. ఈ చిత్ర నిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ శ్రేయాస్ శ్రీను గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో నాకు రైటర్ డార్లింగ్ సామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగిందని, ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని చేసిన సినిమా ఇది అని అన్నారు. డైరెక్టర్ సత్తిబాబు స్క్రిప్ట్ ను బాగా హ్యాండిల్ చేశారని అన్నారు.
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ నేను ఈ మధ్య కాలంలో చేసిన ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ ఈ సినిమాలో చేశానని, ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది అని అన్నారు. నటి శ్రీముఖి మాట్లాడుతూ శ్రేయాస్ శ్రీను గారు ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి సక్సెస్ అయ్యారని ఆయన ప్రొడక్షన్ చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని, గుడ్ సినిమా గ్రూప్ లో ఇదొక మంచి మూవీగా నిలుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. నటి హేమ మాట్లాడుతూ క్రేజీ అంకుల్స్ కథ నాకు బాగా నచ్చింది. శ్రేయాస్ శ్రీను గారితో నేను చాలా ఈవెంట్స్ చేశాను, అతనితో కలిసి సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
చిత్ర దర్శకుడు ఇ. సత్తిబాబు మాట్లాడుతూ గుడ్ సినిమా బ్యానర్‌లో రాబోతున్న క్రేజీ అంకుల్స్ చాలా ఫన్నీగా అందరిని అలరించే విధంగా ఉంటుందని, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్నారు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.