సునీల్ సినిమాలో రష్యా అందాలు..!

సునీల్ సినిమాలో రష్యా అందాలు..!

Published on Aug 4, 2012 5:00 PM IST


ఈ మధ్య తెలుగు సినిమా దర్శకులు ఒనర్సీస్ లోకేషన్ల పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యు.ఎస్, మరియు ఇంగ్లాండ్ లాంటి ప్రదేశాల్లో ఇప్పటికే చాలా సినిమాలను చిత్రీకరించారు. సునీల్ హీరోగా నటిస్తున్న ‘రాధా కృష్ణుడు’ చిత్ర ప్రొడక్షన్ టీం కొత్తదనం కోసం ఈ చిత్రంలో రష్యా అందాల్ని చూపించనున్నారు. ఇటీవలే గోదావరిలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది, కొత్త షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం రష్యా పయనమయ్యారు.

సునీల్ మరియు ఇషాచావ్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ చిత్రానికి రీమేక్. చాలా రోజుల తర్వాత సునీల్ ఈ చిత్రంలో పూర్తి కామెడీ ప్రధానం ఉన్న పాత్రను చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్ర కథలో మార్పులు చేశారు. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ సమర్పణలో పరాస్ జైన్ మరియు ఎన్.వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్ నారాయణ మరియు రఘు బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో సునీల్ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ ని చూడటం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్నిస్తుంది మరియు రష్యా అందాల్ని చూడటానికి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.

తాజా వార్తలు