మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఏప్రిల్ రెండవ వారం నుండి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ లో సాంగ్స్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. అలాగే శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారట. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
కాగా బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.