నలుగురు హీరోలు ఈ సినిమా కావాలన్నారు – శ్రీ

srinivas

‘ఈ రోజుల్లో’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన శ్రీ హీరోగా, అచ్చ తెలుగమ్మాయి సుప్రజ హీరోయిన్ గా పరిచయమవుతున్న సినిమా ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’. ఈ సినిమా ద్వారా సాజిద్ ఖురేషి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తీజర్ ని ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి శ్రీ, సుప్రజ, సాజిద్ ఖురేషి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన హీరో శ్రీ మాట్లాడుతూ ‘ ఫస్ట్ డైరెక్టర్ పిలిచి నీకు హీరో కావాలనుందా, మంచి నటుడు కావాలనుందా అని అడిగాడు. నేను నటున్ని కావాలనుకుంటున్నాను అనడంతో ఆయన నా సినిమా హీరో నువ్వే అని ఫైనలైజ్ చేసాడు. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన ‘నడువుల కొంజెం పక్కత కానోం’ అనే సినిమాకి రీమేక్. మేము ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు, కొంతమంది నిర్మాతలు ఈ సినిమా తమకి ఇమ్మని అడిగారు. దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చుసినిమా కాన్సెప్ట్ ఎంత బాగుందో, అలాగే ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా అని’ అన్నాడు.

హీరో తలకి దెబ్బ తగలడంతో తన జీవితంలోని ఒక సంవత్సర కాలాన్ని మర్చిపోతే తన ఫ్రెండ్స్ మరియు అతని ఫ్యామిలీ తనకి ఆ గతాన్ని ఎలా గుర్తు చేసారు? ఆ సంవత్సరంలో ఎం జరిగింది? అనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఈ చిత్ర బృందం తెలిపారు.

Exit mobile version