బాలయ్య సినిమాలో విలన్ గా సీనియర్ హీరోయిన్.. !

బాలయ్య సినిమాలో విలన్ గా సీనియర్ హీరోయిన్.. !

Published on Apr 12, 2020 2:44 PM IST

పెళ్లి తరువాత కూడా భూమికా చావ్లా వరుస సినిమాల్లో నటిస్తోంది. బాలకృష్ణ ‘రూలర్’లో కూడా ఈ మాజీ హీరోయిన్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా భూమిక మళ్ళీ బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటించబోతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భూమికా ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. పైగా భూమికా పాత్ర బాలయ్య పాత్రతో సమానంగా ఉంటుందట.

ఇక ఈ చిత్రానికి సంభందించిన అప్ డేట్ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి కథానాయకిగా నటిస్తోంది.

తాజా వార్తలు