అమ్మాయిల ప్రేమలో అబ్బాయిలు పడిపోయినట్లు మన టాలీవుడ్ హీరోలు కూడా తమిళ డైరెక్టర్ల మోజులో పడుతున్నారు, ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా వినిపిస్తున్న జోక్. ఈ విషయాన్ని గమనించిన పూరి జగన్నాథ్ తన తీసిన ‘నేనింతే’ సినిమాలో తెలుగు వాడిగా వెలుతుంటే ఆఫర్లు ఇవ్వడంలేదని నా పేరు సెంథిల్ గా మార్చుకుంటున్నాను అని వేణుమాధవ్ చేత చెప్పించారు.
ఈ స్టేట్మెంట్ కి సరిపోయేలా ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్ హీరో నాని ఒక కామెంట్ చేసాడు ‘ కృష్ణ వంశీ, మణిరత్నం ఇద్దరూ నా ఫేవరెట్ డైరెక్టర్లు. ఇందులో మణిరత్నం సినిమా అంటే నాకు కథతో సంబంధం లేదు అలాగే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోను. నాతో సినిమా చేయాలని స్క్రిప్ట్ తో వస్తే నేను సినిమా చేసేస్తానని’ అన్నాడు.
కానీ కృష్ణ వంశీ మరియు మిగతా దర్శకులకు అది వర్తించదు ‘ కృష్ణ వంశీ గారు నా ఇష్ట దర్శకుడే కానీ నేను కథ వినకుండా ‘పైసా’ సినిమా ఓకే చెయ్యలేదు. పూర్తి స్టొరీ విని నచ్చిన తర్వాతే ఓకే చెప్పాను. స్క్రిప్ట్ పరంగానే ఈ సినిమా చేస్తున్నానని’ అన్నాడు.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అందరికంటే మణిరత్నం చాలా డిఫరెంట్ కనుక కొంతమంది నానిని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు.
ఈ విషయం పై మేము విన్న కామెంట్ ఏమిటంటే ” ఫ్లాప్ అయినా తమిళ డైరెక్టర్ ఓకే కానీ అదే తెలుగు డైరెక్టర్ అయితే నో చాన్స్”
ఈనాడు ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి — ఇంటర్వ్యూ