ఫ్లాప్ డైరెక్టర్ మరో ప్రయత్నం ఫలిస్తుందా?

ఫ్లాప్ డైరెక్టర్ మరో ప్రయత్నం ఫలిస్తుందా?

Published on Nov 1, 2012 12:44 PM IST


బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి డైలాగ్ రైటర్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నటుడిగా కొన్ని సినిమాల్లో చేసాడు. కథా రచయితగా కూడా కొన్ని సినిమాలకు పని చేసాడు. గోపీచంద్ హీరోగా వాంటెడ్ అనే సినిమాతో దర్శకుడిగా మారి చేతులు కాల్చుకున్నాడు. స్క్రీన్ప్లే రైటర్ గా కొన్ని సినిమాలకు పని చేసిన రవి ఇటీవల విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు, దేనికైనా రెడీ సినిమాలకు కూడా పని చేసాడు. రవి త్వరలో నిర్మాతగా మారబోతున్నాడు. తన స్నేహితుడు పూర్ణతో కలిసి ‘సెకండ్ హ్యాండ్’ అనే సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాతో కిషోర్ తిరుమల అనే దర్శకుడు, కీరవాణి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన రామకృష్ణ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

తాజా వార్తలు