ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోవడం వల్ల వరుసగా చిన్న సినిమాలు ఒక్కో వారం నాలుగైదు సినిమాలు బాక్స్ ఆఫీసు పై దాడి చేసాయి. కానీ అత్తారింటికి దారేది సినిమా తర్వాత పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడం మొదలవ్వడంతో చిన్న సినిమాల విడుదలలు ఆగిపోయాయి.
బిగ్ బడ్జెట్ సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడం అలాగే ‘మసాలా’ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చేస్తారని అనౌన్స్ చెయ్యడంతో మధ్యలో ఉన్న వీకెండ్ అదేనండి నవంబర్ 8 ఖాళీగా ఉండడంతో చిన్న సినిమా వాళ్ళు తమ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి సిద్దమైపోయారు. అందులోనూ ఒకటి రెండు కాదండి ఏకంగా 5 సినిమాలు ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనున్నాయి. ఈ ఐదు సినిమాలు మాములుగా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ వాయిదా పడ్డాయి. ‘చండీ’, ‘నేనేం చిన్నపిల్లనా’, ‘కాళి చరణ్’, ‘సత్య 2’ మరియు ‘చిన్ని చిన్ని ఆశ’ సినిమాలు ఈ శుక్రవారం విడుదల కానున్నాయి.
చెప్పాలంటే ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం ఆ సినిమాలకే నష్టం అనేది వారు గుర్తించడం లేదు. ఒకవేళ ఈ వారాంతం లోపు ఇందులో ఏమన్నా వాయిదా పడతాయో లేక అన్నీ రిలీజ్ అవుతాయో, రిలీజ్ అయిన వాటిల్లో ఎన్ని ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటాయో చూడాలి..