విజయ్ ‘జన నాయగన్’ ఫస్ట్ రోర్‌కు టైమ్ ఫిక్స్..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను విజయ్ తన లాస్ట్ సినిమాగా ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ రోర్‌ను జూన్ 22న ఉదయం 12 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇలా అర్ధరాత్రి వేళ ఓ స్టార్ హీరో అప్డేట్ రావడం చాలా అరుదు. మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, ఇలా అర్ధరాత్రి పూట తమ సినిమా అప్డేట్ రిలీజ్ చేస్తారని పలువురు సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version