మొదట్లో స్లోగా స్టార్ట్ అయినా ఈసారి బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు మంచి రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ విషయంలో మొదట వీక్షకులు అంత సుముఖంగా లేరు కానీ ఇప్పుడు అలవాటు కావడంతో ఎట్టకేలకు షో ట్రాక్ లో పడింది. వీక్ డేస్ లో కూడా మంచి టీఆర్పీ రాబడుతూ అలరిస్తున్న ఈ షోలో ఒక్కో కంటెస్టెంట్ ను అంతా రీడ్ చేసేసారు.
ఎవరెవరు ఎలా ఉంటున్నారు అన్నది అక్కడ బిగ్ బాస్ గమనిస్తున్నాడు బయట షో వీక్షకులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల్లో మాత్రం ఓ కంటెస్టెంట్ లోని తెలియని యాంగిల్ ఇప్పుడు బయటపడింది అని చెప్పాలి. అతడే జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్. ఇతడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినా సరే అప్పటి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ పాజిటివిటిని తెచ్చుకొన్నాడు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా నిన్నటి ఎపిసోడ్ లో ఇన్ని రోజులు నవ్వుతు నవ్విస్తూ కామ్ గా ఉండే అవినాష్ లో కోపాన్ని కూడా వీక్షకులు చూసారు. షోయెల్ తో జరిగిన టాస్క్ మూలాన అవినాష్ టెంపర్ లూస్ అవ్వడం మొదటిసారిగా కనిపించింది. దీనితో అవినాష్ లో కూడా ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా అనుకుంటున్నారు.