గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో వచ్చిన భారీ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రం గ్లోబల్ సెన్సేషన్ గా నిలిచింది. మరి విడుదల అయ్యి ఇన్నేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా RRR మేనియా వినిపిస్తుంది.
అయితే గత కొంత కాలం నుంచి ఈ భారీ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అనే చర్చ కూడా కొనసాగుతూనే వచ్చింది. ఆమధ్య రాజమౌళిపై వచ్చిన ఓటిటి డాక్యు చిత్రం లాస్ట్ లో కూడా పార్ట్ 2 కోసం మాట్లాడ్డం జరిగింది. అయితే ఇపుడు ఫైనల్ గా దీనిని జక్కన్న కన్ఫర్మ్ చేసేసారు. రామ్ చరణ్ షేర్ చేసిన లేటెస్ట్ వీడియోలో రాజమౌళికి ఎదురైన RRR పార్ట్ 2 ప్రశ్నకి జక్కన్న ఉంది అంటూ సమాధానం ఇవ్వడం చర్చగా మారింది. మరి గ్లోబల్ ఆడియెన్స్ ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్న ఈ ఇండియన్ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి.