11ఏళ్ల తరువాత బాలీవుడ్ కి వెళుతున్న ‘అరుంధతి’.

11ఏళ్ల తరువాత బాలీవుడ్ కి వెళుతున్న ‘అరుంధతి’.

Published on Jul 22, 2020 1:51 PM IST

హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రం అరుంధతి. 2009లో ఎమోషనల్ అండ్ హారర్ జోనర్ లో వచ్చిన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, అనేక రికార్డ్స్ బ్రేక్ చేసింది. అరుంధతి సినిమాతో అనుష్క ఒక్కసారిగా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. విలన్ పాత్ర చేసిన సోను సూద్ కి తెలుగులో మంచి కెరీర్ ని ఇచ్చింది ఆ మూవీ. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నటనకు గాను అనుష్క ఉత్తమ నటి, సూను సూద్ ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. ఇక అనేక విభాగాలలో ఈ మూవీ నంది అవార్డ్స్ అందుకోవడం జరిగింది.

కాగా ఈ క్రేజీ మూవీని ఎప్పటి నుండో హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. అరుంధతి విడుదలైన 11 ఏళ్లకు ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను మెగా నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నారు. ఓ ఫ్యాన్సీ ధరకు అరుంధతి హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న అల్లు అరవింద్ మరో నిర్మాత మధు మంతెనతో కలిసి నిర్మించనున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే…అరుంధతి హిందీ రీమేక్ లో అనుష్క పాత్ర కొరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ని తీసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. మరి ఆమె కనుక ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే మరింత హైప్ రావడం ఖాయం.

తాజా వార్తలు