హైదరాబాద్లో ఈరోజు రాత్రి ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవానికి దిక్షిణాది తారలు తరలిరానున్నారు. ఈ మెగా ఈవెంట్ నొవోటేల్ లో జరగనుంది. తెలుగు, తమిళ,మలయాళం మరియు కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు నుండి పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’, మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మాన్’, రాజమౌళి దృశ్యకావ్యం ‘ఈగ’, నితిన్ లవ్ స్టొరీ ‘ఇష్క్’, రామ్ చరణ్ మాస్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ మరియు అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాలు పోటిపడనున్నాయి. ఉత్తమ నాయిక విభాగంలో సమంత, తమన్నా, అనుష్క, హన్సిక మరియు నయనతార పోటిపడనున్నారు. ఉత్తమ దర్శకుల విషయానికొస్తే ఎస్.ఎస్ రాజమౌళి, హరీష్ శంకర్, క్రిష్, పూరి జగన్నాధ్ తలపడనున్నారు. ఈ వేడుకలో శృతిహాసన్, అమలాపాల్, ఇషా తల్వార్ స్టేజిమీద ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్, అల్లు అర్జున్, కెథరీన్ త్రేస, రానా హాజరుకానున్నారు