5 కోసం ఎదురు చూస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ

5 కోసం ఎదురు చూస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ

Published on Sep 11, 2012 3:54 PM IST


మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్ కూడా 5 కోసం ఎదురు చూస్తోంది. ఇంతకీ ఏంటీ 5 అనుకుంటున్నారా? కుపెర్టినో రూపొందించిన సరికొత్త ఐ ఫోన్ 5. ఆపిల్ వారు తాయారు చేసిన ఈ ఐ ఫోన్ 5 రేపు శాన్ ఫ్రాన్సిస్కో లో విడుదల కానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులు చాలా మంది ఐ ఫోన్ ని ఉపయోగించడానికి ఇష్ట పడతారు మరియు కొంతమంది ఐ ఫోన్ స్టేటస్ సింబల్ గా భావిస్తారు.

మన ఇండస్ట్రీలో చాలా మంచి నిర్మాతలు, దర్శకులు, నటులు మరియు పాటల రచయితలు ఇలా ఎంతో మంది ఐ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్స్ ఐ ఫోన్ 5 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ఐ ఫోన్ వర్షన్స్ కంటే దీనిలో చాలా కొత్త రకమైన ఫీచర్స్ ఉంటాయి. కొన్ని రోజుల్లో న్యూ గాడ్జెట్స్ కలిగిన ఐ ఫోన్ 5ని మన స్టార్స్ చేతుల్లో చూడవచ్చు.

తాజా వార్తలు