కరోనా దెబ్బకు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి ?

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అల్లడిపోతుంది. ఇప్పటికే కరోనా వైరస్ టాలీవుడ్ పరిశ్రమను టెంక్షన్లో పడేసింది. ఈ వైరస్ కారణంగా రిలీజ్ అవాల్సిన పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయి. అయితే జూన్ ఫస్ట్ వీక్ వరకు రిలీజ్ వాయిదా వేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు అది ఇంకా పొగడించే అవకాశం కనిపిస్తోంది.

బంద్ తో పాటు సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని థియేటర్స్ ఓపెనింగ్ ను ఇంకా పోస్ట్ ఫోన్ చేసేలా కనిపిస్తోంది. కానీ, ఈ కరోనా జూన్ లోపు అదుపులోకి రాకపోతే టాలీవుడ్ కి భారీగా నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే థియేటర్స్ మూసివేత పరిణామంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు ఇరుకునపడ్డారు.

ఏమైనా కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి మరియు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశిస్తోన్నా.. కరోనా వైరస్ ఇంకా తన ప్రభావం చూపిస్తూనే ఉంది. మరి రానున్న రోజుల్లో కరోనా ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version