నష్టాలు తగ్గాలంటే ఓటీటీనే బెటర్ !

నష్టాలు తగ్గాలంటే ఓటీటీనే బెటర్ !

Published on Apr 28, 2020 12:55 AM IST

కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా భారత్‌ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరో పక్క లాక్ డౌన్ కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు. సినిమాల షూటింగ్ లు ఆపేశారు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా పూర్తైన సినిమాల విడుదల వాయిదా పడగా, చిత్రీకరణలో ఉన్న సినిమాలు పూర్తిగా ఆగిపోయాయి.

దీంతో లాక్ డౌన్ సమయం ముగిసేనాటికి సినిమా ఇండస్ట్రీ నష్టాలు వందల కోట్లకు పైనే ఉండేలా కనిపిస్తున్నాయి.
బాలీవుడ్, టాలీవుడ్, తమిళం ఇలా అన్ని పరిశ్రమల్లో చాలా సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. రానున్న రోజుల్లో కూడా బిజినెస్ ఉండేలా కనబడకపోవడంతో నష్టాలు భారీగా ఉండనున్నాయి. మరి సినీ ఇండస్ట్రీస్ ఈ నష్టాల్ని కొంతైనా తగ్గించుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకోవడం బెటర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు