ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి ఎంటర్ అవడం వల్ల వర్షా కాలం ప్రారంభమైంది, దీనివల్ల రాష్ట్రంలోని పలు ఏరియాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల వల్ల రాకపోకలకి, పవర్ సెక్టార్ కి పలు ఇబ్బందులు రావడం వల్ల ఫిలిం ఇండస్ట్రీని కాస్త కంగారు పడుతోంది.
‘వర్షాలు బాగా ఎక్కువగా ఉంటే సినిమా కలెక్షన్స్ తగ్గుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఫ్యామిలీ ఆడియన్స్, ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రారు. అలాగే కరెంట్ ఉండకోపోవడం కూడా పెద్ద ఇబ్బందని’ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ అన్నాడు.
చెప్పాలంటే టాలీవుడ్ కి ఈ సమ్మర్ సీజన్ కూడా చాలా డల్ అయ్యింది. కేవలం భారీ బడ్జెట్ సినిమాలైన ‘బాద్షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ తప్ప ఇంకేమీ సినిమాలు లేవు. టాలీవుడ్ గోల్డెన్ సమ్మర్ హాలిడేస్ సీజన్ ని మిస్ చేసుకుంది. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ జూన్ లో బాగా బిజీగా ఉండనున్నారు. వర్షాల వాళ్ళ సినిమా రేవిన్యూకి ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని ఆశిద్దాం..