55వేల ఇద్దరమ్మాయిలతొ సినిమా పైరసీ డి.వి.డి లు పట్టివేత

55వేల ఇద్దరమ్మాయిలతొ సినిమా పైరసీ డి.వి.డి లు పట్టివేత

Published on Jun 1, 2013 10:00 AM IST

Iddarammayilatho piracy

భారీ అంచనాల నడుమ, బృందమంతా అహర్నిశలు శ్రమించి ఒక సినిమాను విడుదల చేస్తే ఆ చిత్రం రిలీజ్ రోజే పైరసీ డి.వి.డి లు మార్కెట్లోకి వచ్చేస్తే ఆ సినిమా బృందం పడ్డ కష్టం ఏమైపోవాలి? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతొ..’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైయింది. కానీ ఈరోజు గుంటూరులో ఈ సినిమాకు సంభందించిన 55000 పైరసీ డి.వి.డిలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు పట్టుకున్నారు. దీని మొత్తం 22లక్షలు ఉంటుందని అంచనా. అన్నట్టు ఒక్క రోజులో 55వేల పైరసీ డి.వి.డిలు ఎలా తీసి ఉంటారంటారు?? ఏది ఏమైనా మన పైరసీ నిరోధక విభాగం గొప్ప పనే చేసిందని చెప్పుకోవాలి.

తాజా వార్తలు