ఫైటర్ కోసం పూరి ప్లాన్ ఛేంజ్ చేస్తున్నారట.

ఫైటర్ కోసం పూరి ప్లాన్ ఛేంజ్ చేస్తున్నారట.

Published on Apr 25, 2020 10:09 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫైటర్. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

లాక్ డౌన్ కి ముందు ముంబైలో రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసింది చిత్ర బృందం. నెక్స్ట్ షెడ్యూల్ కూడా ముంబైలోనే మొదలుకావాల్సి ఉండగా ఆ ప్రణాళిక మార్చుకున్నట్లు తెలుస్తుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని పూరి భావిస్తున్నాడట. అందుకే ఆయన హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో మూవీ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు