షూట్ కి ‘ఫైటర్’ కూడా రెడీ !

డేరింగ్ డైరెక్టర్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ ఏదో కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతొంది. వచ్చే నెల 24 నుండి హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో మొదలుకానుందని, ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ స్ తీయబోతున్నారని తెలుస్తోంది.

ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడని.. చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కారణంగానే విజయ్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట. అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version