ఇంటర్వ్యూ : ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ – ‘అఖండ 2’లో బాలయ్య విశ్వరూపం చూస్తారు!

ఇంటర్వ్యూ : ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ – ‘అఖండ 2’లో బాలయ్య విశ్వరూపం చూస్తారు!

Published on Nov 24, 2025 7:05 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘అఖండ 2’ ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయి?

అఖండ కి మించిన అంచనాలు ‘అఖండ 2 పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ గారి పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి గారు బాలయ్య గారి విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి గారు కూడా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ గారు చాలా కొత్త గెటప్ ఇచ్చారు. అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్ ని చాలా కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది.

మీ యాక్షన్ కంపోజిషన్ చూసిన తర్వాత బాలయ్య గారు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు?

బాలయ్య బాబు గారితో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాము. మేము అంటే బాబు గారికి చాలా నమ్మకం. మేము సింహ లెజెండ్ లాంటి మాస్ క్యారెక్టర్స్ కి ఫైట్స్ డిజైన్ చేశాము. సినిమాలో యాక్షన్ మీరు చూస్తున్నప్పుడు గూజ్బంప్స్ వస్తాయి. బాలయ్య గారు ఒక అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకుని సూట్ కి వెళ్లేవాళ్లం. బాబు గారు క్యారెక్టర్ తగ్గట్టు స్లీవ్ లెస్ లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు. ఒక పాత్రలో అంతగా లీనమైపోయే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ గారిని లాంటి నటుడు మనకు ఉండడం మనందరికీ గర్వకారణం.

నిర్మాతల గురించి?

14 రీల్స్ గోపి గారికి రామ్ గారికి ధన్యవాదాలు. అఖండకు మించి డబల్ త్రిబుల్ స్పాన్ ఉన్న సినిమా ఇది. మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో అద్భుతంగా తీసుకువెళ్లాలని ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ని గొప్పగా తీసేలా ప్రోత్సహించారు. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుడు శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలా ఈ సినిమా ఉండబోతుంది.

యాక్షన్ లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి?

ఇందులో మూడు వేరియేషన్స్ ఉన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. మొత్తం మూడు క్యారెక్టరైజేషన్ కూడా మాకు కొత్తగా చేసే అవకాశం ఇచ్చాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా యాక్షన్ అత్యంతం అలరిస్తుంది.

అఖండలో చక్రం తిప్పే సీన్ చాలా హైలెట్ అయింది కదా అలాంటిది ఈ సినిమాలో ఉంటుందా?
కచ్చితంగా అంతకుమించిన యాక్షను ఈ సినిమాలో ఉంటుంది. మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో జనానికి నచ్చిన అంశాలు ఏంటి తర్వాత ఇలాంటి కొత్తదనం ఇవ్వాలనిదాని గురించి ఆలోచన చేస్తాము. అలా ఆలోచిస్తున్నప్పుడు అఖండలో ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కైతే కనెక్ట్ అయ్యారో అంతకుమించి యాక్షన్ ఈ సినిమాలో కంపోజ్ చేయడం జరిగింది.

తాజా వార్తలు