దాదాపు రెండున్నరేళ్లు దాటింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వెండితెర మీదకు వచ్చి. అలా చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ పవన్ మేకప్ వేసుకున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు బావుండి ఉంటే ఈ పాటికే వకీల్ సాబ్ విడుదలయ్యి చాలా కాలం అయ్యిపోయేది. కానీ ఆగిపోవడంతో ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యి ఎప్పుడు విడుదలకు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది.
ఇక ఈ గ్యాప్ లో ఒక సరైన అప్డేట్ కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇపుడు ఆ సరైన సమయం రానే వస్తుంది. వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు కావడంతో ఆరోజు పవన్ చేస్తున్న సినిమాలుకు చెందిన అధికారిక అప్డేట్స్ ను ఆశిస్తున్నారు పవన్ అభిమానులు. వీటిలో మాత్రం “వకీల్ సాబ్” యూనిట్ నుంచి అప్డేట్ రావడం పక్కా అయ్యిపోయింది. అందుకు హింట్ ఇస్తూ ఈ చిత్రానికి పని చేస్తున్న సంగీత దర్శకుడు థమన్ ఒక హింట్ ఇచ్చారు.
పవన్ పుట్టినరోజు వచ్చే బుధవారం రావడంతో ఆరోజును హైలైట్ చేస్తూ థమన్ ట్వీట్ చేసాడు. ఇక అంతే అర్ధం అయ్యిపోయింది ఆ రోజు అప్డేట్ ఉంది అని దీనితో ఆరోజు జాతర కన్ఫామ్ అయ్యింది. కానీ మరి ఆరోజు ఏ అప్డేట్ తో వకీల్ సాబ్ యూనిట్ వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలి, నివేతా థామస్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
WED – NES – DAY !! ❤️
— thaman S (@MusicThaman) August 28, 2020