సూపర్ స్టార్ మహేష్ బాబు చూడటానికి చాలా అందంగా, హన్డ్సం గా ఉంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. తాజాగా విడుదల చేసిన ‘1-నేనొక్కడినే’ పోస్టర్స్ లో మహేష్ బాబు మరింత హన్డ్సంగా కనిపిస్తున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఇటీవలే కొన్ని కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్స్, స్టిల్స్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు.
కొన్ని పోస్టర్స్ లో మహేష్ బాబు రాక్ స్టార్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘1- నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని ఈ నెల 19న రిలీజ్ చేయనున్నారు.