ఎన్టీఆర్ వలే ఫ్యాన్స్ ది కూడా దాన గుణమే

ఎన్టీఆర్ వలే ఫ్యాన్స్ ది కూడా దాన గుణమే

Published on May 9, 2020 12:03 AM IST

కరోనా కష్ట కాలంలో ఎన్టీఆర్ తన సిబ్బంది పట్ల చూపిన ఔదార్యం విశేషంగా నిలిచింది. ఎన్టీఆర్ త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాఫ్‌తో పాటు వారి కుటుంబాల‌కి అండగా నిలిచారు. స్టాఫ్ అంద‌రి‌కి అడ్వాన్స్‌ వేత‌నం అందించిన ఎన్టీఆర్ .. రానున్న‌రోజుల‌లో కూడా ఎలాంటి ఇబ్బంది వ‌చ్చిన కూడా మీ అంద‌రికి నా అండ త‌ప్ప‌క ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చార‌ట‌. ఎన్టీఆర్ ఔదార్యాన్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మా ఎన్టీఆర్ ప్రత్యేకకం అని సంబరపడిపోతున్నారు. ఎన్టీఆర్ వలె ఫ్యాన్స్ కి కూడా ఈ దానం గుణం మెండే. చాలా రోజుల క్రితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్’ పేరుతో ఓ సంస్థ స్థాపించారు. ఆ సంస్థ పేరిట పేదల అవసరాలను వీరు తీర్చుతున్నారు.

ఇక మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజున కూడా వీరు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసి ఉంచారు. ఐతే కరోనా నేపథ్యంలో అప్పటి పరిస్థితులను బట్టి వీరి కార్యక్రమాల నిర్వహణ ఆధారపడి ఉంటాయి. మరో వైపు ఆ రోజు ఆర్ ఆర్ ఆర్ నుండి విడుదల కానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు