కీర్తి మరో సినిమాకు ఫ్యాన్సీ ప్రైస్.?

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నారు. “మహానటి” చిత్రంతో వచ్చిన ఫేమ్ తో ఆగని కీర్తి కు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అనేక ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. అలాగే ఇప్పటికే చాలా సినిమాల్లో కీర్తి నటించింది. అయితే ఇప్పుడు పరిస్థితుల రీత్యా కూడా కీర్తి నటించిన సినిమాలే ఎక్కువగా డిజిటల్ విడుదలకు నోచుకుంటున్నాయి.

అలా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో “పెంగ్విన్” చిత్రం విడుదల కాగా మరో రెండు చిత్రాలు కూడా ఓటిటి లోనే విడుదలకు సిద్ధం కావడం దాదాపు ఖరారు అయ్యింది. ఇటీవలే విడుదలైన టీజర్ తో ఆకట్టుకున్న చిత్రం “గుడ్ లక్ సఖి” విషయాన్నీ పక్కన పెడితే దీనికి ముందు నుంచి విపరీతమైన బజ్ వినిపిస్తున్న చిత్రం “మిస్ ఇండియా”.

నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏఈ చిత్రం తాలుకా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. వారు ఏఈ చిత్రానికి 11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version