ప్రభాస్ అధ్బుతమైన యోగా స్టూడెంట్ అట.

ప్రభాస్ అధ్బుతమైన యోగా స్టూడెంట్ అట.

Published on Jun 21, 2020 12:37 PM IST

ప్రముఖ యోగ ట్రైనర్ రూహి యోగా డే ను పురస్కరించుకొని..ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు. హీరో ప్రభాస్ యోగా టీచర్ రూహి… ఎలా తన వృత్తితో మెరుగైన ఫలితాలు సాధించడానికి.. ఏకాగ్రత సాధించడానికి సహకరించారో వివరించిన వీడియో ట్విట్టర్ లో పంచుకున్నారు. రూహి ప్రభాస్ కి యోగా టీచర్ గా ఉన్నారన్న విషయం నేడు బహిర్గతం అయ్యింది. అలాగే తన స్టూడెంట్స్ లో ప్రభాస్ అధ్బుతం అని చెప్పడం విశేషం.

ఈ యోగా ట్రైనర్ రూహి రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉన్న సెంథిల్ కుమార్ సతీమణి. ఇక మరో వైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజులలో ప్రభాస్ 20 పై అప్డేట్ ఉంటుందని కొద్దిరోజులుగా గట్టి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి రాధే శ్యామ్ టైటిల్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి . దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు